ఇద్దరు కుమార్తెల పుస్తకాల ఖర్చు రూ.17వేలు | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు కుమార్తెల పుస్తకాల ఖర్చు రూ.17వేలు

Jun 22 2026 12:48 AM | Updated on Jun 22 2026 12:48 AM

నా ఇద్దరు కుమార్తెలు యలమంచిలి ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో చదువుతున్నారు.చిన్న కుమార్తె 2వ తరగతి పుస్తకాలకు రూ.8వేలు,పెద్ద కుమార్తె 5వ తరగతి పుస్తకాలకు రూ.9999 తీసుకున్నారు.ఇది కాకుండా యాప్‌ కోసం ఏడాదికి ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున కడుతున్నాను.ఫీజు కూడా ఇద్దరికీ కలిపి రూ.50 వేలు అవుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లించవలసి వస్తోంది.ప్రైవేటు స్కూళ్లపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.నిబంధనలు అమలు చేస్తే తల్లిదండ్రులందరికీ ప్రయోజనం ఉంటుంది.

– చాకలి నూకరాజు,యలమంచిలి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement