దేవరాపల్లి: గ్రామాల్లో వీధి వీధిన విచ్చలవిడిగా బెల్టుషాపులు తెరిచిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చిందని వైఎస్సార్‌సీపీ ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ విమర్శించారు. దేవరాపల్లిలో శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సంపద సృష్టిస్తామని గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేసిందన్నారు. విశాఖప ట్నం బీచ్ పరిసరాలను బీర్లు, వైన్ ఇతర మత్తు పానీయాల విక్రయాలకు ఆవాసాలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. బీచ్ పరిసరాల్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తదితర అంతర్జాతీయ కార్యక్రమాలతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహి స్తారని, అలాంటి ప్రాంతంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు.


