భూగర్భ జలాల పెంపునకు కృషి | - | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాల పెంపునకు కృషి

Jun 21 2026 12:31 AM | Updated on Jun 21 2026 12:31 AM

● ఎస్పీతుహిన్‌ సిన్హా

● ఎస్పీతుహిన్‌ సిన్హా

ఎస్పీ కార్యాలయంలో నీరు–మీరు కార్యక్రమం నిర్వహిస్తున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి: భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు ప్రతి వ్యక్తి కృషి చేయాలని ఎస్పీ తుహిన్‌ సిన్హా అన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో నీరు–మీరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు యంత్రాంగం కేవలం శాంతిభద్రతల పరిరక్షణలోనే కాకుండా సామాజిక బాధ్యతను నిర్వహించడంలోనూ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌, కార్యాలయం, గృహాల వద్ద ఇంకుడు గుంతల ఏర్పాటు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మోహనరావు, సీఐలు బాల సూర్యారావు, టి.లక్ష్మి, శ్రీనివాస రావు, సతీష్‌, పిల్లా రమేష్‌, ఎస్‌ఐలు ప్రసాద్‌, రమణయ్య, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement