వేదశ్రీకి విట్‌లో ఉచిత బీటెక్‌ సీటు | - | Sakshi
Sakshi News home page

వేదశ్రీకి విట్‌లో ఉచిత బీటెక్‌ సీటు

Jun 19 2026 12:36 AM | Updated on Jun 19 2026 12:36 AM

రోలుగుంట: ఇంటర్‌లో జిల్లా టాపర్‌గా నిలిచిన మలసాల వేదశశ్రీ అమరావతిలోని విట్‌లో సీఆర్పీ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ) పథకం కింద ఉచిత బీటెక్‌ విద్యకు ఎంపికై ంది. ఈ మేరకు గురువారం స్థానిక జూనియర్‌ కళాశాలలో విద్యార్థినిని ప్రిన్సిపాల్‌ అప్పలరాజు, అధ్యాపకులు శాలువా కప్పి సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ రైతు కుటుంబానికి చెందిన వేదశ్రీ ఇంటర్‌ ఫలితాల్లో 981 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచి కళాశాలకు గుర్తింపు తెచ్చిందని కొనియాడారు. విట్‌లో ఉచిత సీట్లకు ఎంపికై న ఏడుగురులో వేదశ్రీ ఒకరన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement