● డిపోలో 500 కేజీల బియ్యం మాయం
● గవరపాలెంలో విజిలెన్స్ తనిఖీలు,
కేసు నమోదు
అనకాపల్లి : స్థానిక గవరపాలెం సంతబైల వద్ద రేషన్ డిపో నెంబర్ 29 బాదంపూడి సాయి వర్ధన్ డిపోపై మంగళవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ రమణయ్య తన బృందంతో డిపోలో తనిఖీలు చేపట్టారు. రికార్డుల ప్రకారం ఉండాల్సిన నిల్వల కంటే 500 కేజీల బియ్యం తక్కువగా ఉండడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో స్థానిక సీఎస్‌డీటీ లీలా శేషు కుమారి ఆధ్వర్యంలో డిపోపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఎస్‌డీటీ లీలా శేషు కుమారి మాట్లాడుతూ ‘గవరపాలెంలోని రేషన్ డిపోలపై వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా దాడులు నిర్వహిస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే డిపోలపై కేసులు నమోదు చేస్తున్నామని, ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు విజిలెన్స్ శాఖ తనిఖీలను ముమ్మరం చేసిందని సీఎస్‌డీటీ చెప్పారు.


