యువకుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడు ఆత్మహత్య

Feb 14 2026 7:49 AM | Updated on Feb 14 2026 7:49 AM

యువకుడు ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య

● తనను పెంచిన పెద్దమ్మ,మేనమామ మృతితో కుంగిపోయినట్టు డైరీలో సూసైడ్‌ నోట్‌

యలమంచిలి రూరల్‌: చిన్నతనం నుంచి తనను పెంచిన పెద్దమ్మ,మేనమామ మృతి చెందడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తన తనను పెంచి పెద్ద చేసిన పెద్దమ్మ, మేనమామ ఇద్దరూ లేకపోవడమే ఆత్మహత్యకు కారణంగా తన డైరీలో రాసుకున్నాడు.ఈ ఘటన యలమంచిలి పట్టణం ద్వారకానగర్‌ పాత ఎస్‌బీఐ కాలనీలో చోటుచేసుకుంది.పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి తెలిపిన వివరాలు... పాత ఎస్‌బీఐ కాలనీలో నివాసముంటున్న అలుగోలు వీరవెంకట శివనాగేశ్వరరావు శుక్రవారం ఉదయం తను నివాసముంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.మృతుని తల్లిదండ్రులు తగరపువలసలో ఉంటున్నారు. అలుగోలు వీరవెంకట శివనాగేశ్వరరావు తండ్రి తగరపువలసలో కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు.శుక్రవారం ఉదయం తమ కుమారుడికి పలుమార్లు ఫోన్‌ చేసినపుడు కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి స్థానికంగా తమకు తెలిసిన ఒక యువకుడ్ని శివనాగేశ్వరరావు వద్దకు వెళ్లాలని కోరారు.ఈ మేరకు ఆ యువకుడు అక్కడకు వెళ్లగా తలుపు వేసి ఉండడం చూశాడు.కిటికీలోంచి చూడగా శివనాగేశ్వరరావు ఉరి వేసుకుని మృతి చెందినట్టు గుర్తించి, తల్లిదండ్రులకు తెలిపాడు.ఒంటరి అయ్యాననే భావన,తనను పెంచి పెద్ద చేసిన పెద్దమ్మ,మేనమామ కొన్నేళ్ల క్రితం చనిపోవడంతోనే బలన్మరణానికి పాల్పడినట్టు తన డైరీలో రాసుకున్నాడు.ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు ప్రైవేటుగా పనులు చేసుకుంటూ బతుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.శవపంచనామా,పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement