జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
IIలో
గత టీడీపీ ప్రభుత్వంలో రెవెన్యూ సిబ్బంది ఇష్టానుసారంగా భూముల వివరాలు మార్చేయడంతో రైత్వారీ ఇనాం భూములు దేవదాయ భూముల జాబితాలో చేరిపోయాయి. దీంతో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు కాక, ప్రభుత్వ పథకాలు వర్తించక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కోర్టు తీర్పు రైతులకు అనుకూలంగా వచ్చినా క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంతో కర్షకులు కష్టాలపాలవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇదిగో అదిగో అంటూ తిప్పుతున్నారు తప్ప చిత్తశుద్ధితో పరిష్కరించే నాథుడే కరవయ్యాడు.
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి
కల్యాణపులోవ జాతరకు పటిష్ట ఏర్పాట్లు
అనకాపల్లి: జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు అదనపు ఏఎస్పీ ఎల్.మోహన్‌రావు తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్పీ–సంపర్గ్(ఫోన్ ఇన్ ఎస్పీ) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ పోలీసుస్టేషన్‌ల్లో విధులు నిర్వహిస్తున్న 10 మంది సిబ్బంది ఫోన్ ద్వారా వారి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం పోలీసు సిబ్బంది సమస్యలపై ఉదయం 11 నుంచి 12 గంటల వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సిబ్బంది తెలిపిన సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సీహెచ్.తిలక్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రతాప్ శేషయ్య, బీమాబాయి, ప్రేయర్ సన్, ఎస్‌ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


