లాక్కునేందుకు కుట్ర | - | Sakshi
Sakshi News home page

లాక్కునేందుకు కుట్ర

Feb 14 2026 7:49 AM | Updated on Feb 14 2026 7:49 AM

లాక్క

లాక్కునేందుకు కుట్ర

దళితుల భూములను

సాక్షి, అనకాపల్లి/రాంబిల్లి(అచ్యుతాపురం):

ళితలంటే చంద్రబాబు ప్రభుత్వానికి చాలా చులకన అని.. 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం నిరుపేద దళితలకు ఇచ్చిన భూములను దౌర్జన్యంగా కూటమి నేతలు లాక్కొంటున్నారంటూ మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ మండిపడ్డారు. అన్ని హక్కులున్నా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సెజ్‌ నిర్వాసితుల ఇంటి స్థలాల పేరిట డీ– పట్టాభూములను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. మీ స్వార్థం కోసం కాకుండా.. సెజ్‌ నిర్వాసితుల కోసమే తీసుకోవాలనుకున్నప్పుడు బాధితులకు నోటీసులు ఇవ్వకుండా, నష్ట పరిహారం ఇవ్వకుండా, చట్ట విరుద్ధంగా ఎలా లాక్కొంటారంటూ మండిపడ్డారు. ఈ ప్రాంతంలో భూములకు అధిక రేట్లు పలుకుతున్నందున దళితుల నుంచి లాక్కోవాలనుకుంటే.. వైఎస్సార్‌ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో తమ భూములను లాక్కొనేందుకు యత్నిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, స్థానిక కూటమి నేతలకు వ్యతిరేకంగా 12 రోజులుగా దళితులు నిర్వహిస్తున్న నిరసన శిబిరాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త్త బొడ్డేడ ప్రసాద్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి, సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రొంగలి రాము సందర్శించి, మద్దతు తెలిపారు. బాధిత దళితులకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. వారితో పాటు ధర్నాలో కుర్చొని చంద్రబాబు ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, కూటమి నేతలు, అధికారుల తీరుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగి రాకుంటే..ఈ సమస్యను వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తామంటూ హామీ ఇచ్చారు.

వైఎస్సార్‌ సీపీ చూస్తూ ఊరుకోదు

ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. డిపట్టాలున్నా సెజ్‌ నిర్వాసితులకు ఇళ్ల స్థలాల కోసమంటూ వారి దళితుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవాలని స్థానిక ఎమ్మెల్యే, ఈ ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు అఽధికారం ఇచ్చింది దళితుల భూములను దోచుకోవడానికి, లాక్కోవడానికి కాదన్నారు. దళిత రైతులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, నష్ట పరిహారం అందజేయకుండా రాత్రికి రాత్రే లాక్కోవాలని ప్రయత్నాలు చేస్తే..వైఎస్సార్‌ సీపీ చూస్తూ ఊరుకోదని, దళితులకు అండగా న్యాయ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

దళితులంటే చిన్నచూపు..

మాజీ ఎమ్మెల్యే కంబాల జోగుల మాట్లాడుతూ..చంద్రబాబు ప్రభుత్వానికి దళితులంటే చాలా చిన్నచూపని తెలిపారు. రాంబిల్లి మండలంలో ప్రభుత్వం భూమి ఉండగా సెజ్‌ నిర్వాసితుల కోసం దళితుల భూమే కనిపించిందా..? అంటూ మండిపడ్డారు. పేద దళితుల కడుపుకొట్టి..ఽఅక్రమంగా లాక్కొనేందుకు స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో రెవెన్యూ, పోలీసు అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.

పరిహారం ఇచ్చి భూములు తీసుకోవాలి

వైఎస్సార్‌సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఈ భూములు అవసరమనుకుంటే దళితులకు పరిహారం చెల్లించి సేకరించాలన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నిర్వాసితులకు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇదే మండలంలో రాజకోడురు గ్రామంలో డీపట్టా ఉన్న రైతుకు ఎకరాకు రూ.50లక్షల చెల్లించి భూమి తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు.

హోం మంత్రి స్పందించరా ?

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి మాట్లాడుతూ..చంటి బిడ్డలతో ఉన్న దళిత మహిళలపై స్థానిక ఎమ్మెల్యే దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. సొంత జిల్లాలో దళితులపై దాడులకు పాల్పడి..దళితుల భూములు లాక్కొంటున్నా దళిత సామాజిక వర్గానికి చెందిన హోంమంత్రి అనిత స్పందించారా..? అంటూ ప్రశ్నించారు. దళితుల భూములు లాక్కొనేందుకే ఈ ప్రాంతంలో జనసేనను గెలిపించారా అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యుడు బోదెపు గోవింద్‌, వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీలు దూళి నాగరాజు, సేనాపతి సంథ్యా రాము, ఎంపీపీలు గొట్టిముక్కల శిరీష శ్రీనుబాబు, కోన సంధ్య బుజ్జి, రాంబిల్లి మండల అధ్యక్షుడు కిషోర్‌ రాజు, రాంబిల్లి మాజీ యూత్‌ ప్రెసిడెంట్‌ ఉప్పులూరు నాయుడు, రాంబిల్లి మాజీ ఎంపీపీ కన్నం తిరుపతిరావు, రాంబిల్లి యూత్‌ అధ్యక్షుడు ధూళి వెంకీ, నర్మాల కుమార్‌, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు,సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగలి రాము, రాంబిల్లి మండలం సీపీఎం కార్యదర్శి గోకివాడ దేముడు, అచ్యుతాపురం సీఐటీయూ కార్యదర్శి కుండ్రపు సోమునాయుడు, పంచదార్ల గ్రామ వైఎస్సార్‌ సీపీ నాయకులు చందక రాజు, భూనిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.

50 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం అందజేత

నాటి నుంచి సాగులో ఉన్న రైతులకు తెలియకుండా కాజేసేందుకు యత్నం

నోటీసులు ఇవ్వకుండా అధికారులతో బెదిరించి ఎలా తీసుకుంటారు

దళితుల నిరసనకు వైఎస్సార్‌సీపీ, సీపీఎం మద్దతు

హాజరైన కరణం ధర్మశ్రీ, జోగులు, బొడ్డేడ ప్రసాద్‌, సీపీఎం నేతలు

లాక్కునేందుకు కుట్ర1
1/4

లాక్కునేందుకు కుట్ర

లాక్కునేందుకు కుట్ర2
2/4

లాక్కునేందుకు కుట్ర

లాక్కునేందుకు కుట్ర3
3/4

లాక్కునేందుకు కుట్ర

లాక్కునేందుకు కుట్ర4
4/4

లాక్కునేందుకు కుట్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement