తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య
అనకాపల్లి టౌన్: తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణ పరిధిలో జరిగింది. పట్టణ ఎస్‌ఐ అల్లు వెంకటేశ్వరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయరామరాజుపేట శ్రీరామ్‌నగర్ కాలనీలో నివాసముంటున్న గుండే అభిషేక్ కుమార్ (17)బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఫ్రెండ్స్‌తో వెళతానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి రావడంతో అతని తల్లి ఎస్.కె షకీనా ఎందుకు ఆలస్యంగా వచ్చావని మందలించింది. దీంతో మనస్థాపం చెంది గదిలో గడియపెట్టుకొని ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని చనిపోయాడు. కొద్దిసేపటి తరువాత గమనించిన తల్లి చుట్టుపక్కల వాళ్లని పిలిచి తలుపులు బద్దలు కొట్టి అభిషేక్‌ను కిందికి దించి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అభిషేక్ ఇటీవలే ఇంటర్ పరీక్షలు రాశాడు. ఘటనపై మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


