రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
అనకాపల్లి టౌన్: మండలంలోని బవులవాడ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నా యి. చోడవరం నుంచి అనకాపల్లి వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో, అనకాపల్లి నుంచి చోడవరం వైపు వెళుతున్న కారు బవులవాడ సమీపంలో ఎదురెదుగా వస్తూ బలంగా ఢీకొన్నాయి. దీంతో ఆటో పై భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న చోడవరం మండలం అంబేరపురానికి చెందిన ఏడుగురు మహిళల్లో నలుగురికి స్వల్పగాయాలు కాగా, ఆళ్ళ ముత్యాలమ్మ(51) అనే మహిళ తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించి చికిత్స అందజేశారు.


