No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Nov 5 2024 1:50 AM | Updated on Nov 5 2024 1:50 AM

No Headline

No Headline

అనకాపల్లి: తుమ్మపాల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–17 బాల, బాలికల ఖోఖో పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. రాష్ట్రంలో మొత్తం 26 జిల్లా నుంచి 44 టీమ్‌లు పాల్గొన్నాయి. ఫైనల్స్‌ బాలుర విభాగంలో విశాఖ–ప్రకాశం జిల్లాల మధ్య జరిగిన పోటీలో విశాఖ జిల్లా జట్లు ప్రథమ స్థానం సాధించగా, బాలికల విభాగంలో విశాఖ–నెల్లూరు జిల్లాల మధ్య జరగగా.. విశాఖ బాలికల జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement