మాడుగుల ఎంపీపీ పదవికి రామధర్మజ రాజీనామా | Sakshi
Sakshi News home page

మాడుగుల ఎంపీపీ పదవికి రామధర్మజ రాజీనామా

Published Tue, Jan 23 2024 6:28 AM

జెడ్పీ సీఈవో పోలినాయుడుకు రాజీనామా లేఖను అందజేస్తున్న రామధర్మజ  - Sakshi

మాడుగుల రూరల్‌ : మాడుగుల మండల పరిషత్‌ అధ్యక్ష పదవికి వేమవరపు రామధర్మజ (పెదబాబు) సోమవారం సాయంత్రం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఉమ్మడి జిల్లా పరిషత్‌ సీఈవో ఎం.పోలినాయుడుకు అందజేశారు. తాను ఎంపీటీసీగా కొనసాగుతానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ సీఈవో పోలినాయుడు మాట్లాడుతూ ఎంపీపీ రాజీనామా లేఖను కలెక్టర్‌ అమోదం కోసం పంపిస్తామన్నారు. పెదబాబు మాట్లాడుతూ తనకు రెండున్నర సంవత్సరాలు పాటు సహకరించిన ఎంపీటీసీ సభ్యులు, నాయకులకు, ఉద్యోగులకు కృతజ్జతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement