సీలేరు: ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (327) సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని ఎగువ, దిగువ సీలేరు రీజనల్, బ్రాంచి కార్యవర్గ ఎన్నికలు శనివారం నిర్వహించారు. జెన్‌కో సెక్రటరీ జె.శ్రీను, జెన్‌కో జనరల్ సెక్రటరీ పి.ఆనందబాబు అధ్యక్షతన ఐఎన్‌టీయూసీ 327 యూనియన్ కార్యాలయంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఎగువ, దిగువ సీలేరు రీజనల్ అధ్యక్షుడిగా వై.దారరాజు, కార్యదర్శిగా టి.దుర్గాప్రసాద్, కోశాధికారిగా జి.శ్రీను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదిలం శ్రీను, అడ్వైజర్‌గా ఎంఆర్‌పీ రమణ, సహాయ కార్యదర్శిగా ఎం.ఉపేంద్ర ఎన్నికయ్యారు. అలాగే లోయర్ సీలేరు బ్రాంచి కార్యదర్శిగా చామంతి రాము, కార్యాలయ కార్యదర్శిగా శర్మ, బ్రాంచి కోశాధికారిగా వీరన్నను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎగువ, దిగువ సీలేరు పరిధిలోని ఐఎన్‌టీయూసీ 327 యూనియన్ నాయకులు జి.సుకుమార్, జె.శ్రీను, లామా, నాగేశ్వరరావు, డి.శంకర్, డి.శ్రీను తదితర కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.


