‘జి.మాడుగుల’లో ఆసక్తికర పోరు | - | Sakshi
Sakshi News home page

‘జి.మాడుగుల’లో ఆసక్తికర పోరు

Nov 29 2026 2:23 PM | Updated on Nov 29 2026 2:23 PM

జి.మాడుగుల: పంచాయతీ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. మండలంలోని 17 పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనుంది. సర్పంచ్‌ స్థానాలకు 145 మంది, 188 వార్డు స్థానాలకు 460 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వివిధ రాజకీయ పార్టీల మద్దతుదారులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉండటంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.

గెలుపే లక్ష్యంగా.. : గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు తమదైన శైలిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేశారు. గ్రామాల్లో మద్దతు కూడగట్టుకుంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి వరకు ప్రచారం సాగించారు. ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ మంది విద్యావంతులు పోటీకి దిగడం విశేషం. ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాల్లోనూ రాజకీయ చైతన్యం పెరిగి ఎన్నికలపై ఆసక్తి కనిపిస్తోంది.

ఉత్సాహంగా బరిలోకి.. : ఒకప్పుడు కిల్లంకోట, బొయితిలి, నుర్మతి వంటి మారుమూల పంచాయతీల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు వచ్చేవారు కాదు. మావోయిస్టుల ప్రభావంతో ఎన్నికల బహిష్కరణ పిలుపులు ఉండేవి. ప్రస్తుతం ఆ ప్రభావం తగ్గడంతో ఆయా ప్రాంతాల్లోనూ ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. కొన్ని స్థానాల్లో ముగ్గురు నుంచి 11 మంది వరకు అభ్యర్థులు పోటీ పడుతుండటం ఈసారి ఎన్నికల ఉత్సాహానికి అద్దం పడుతోంది.

ప్రజల్లో ఉత్కంఠ : మరోవైపు మండలంలోని 17 పంచాయతీల పరిధిలో 18 గ్రామ సచివాలయాలు కొత్త పాలకవర్గాల కోసం ఎదురుచూస్తున్నాయి. గత రెండు నెలల క్రితం పాత పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో వాటి స్థానంలో కొత్త పాలకవర్గాలను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తోంది. ఎన్నికల ఫలితాలతో గ్రామాల్లో కొత్త పాలనకు నాంది పలకనుండటంతో ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

అభ్యర్థుల భవితవ్యం నేడే తేలేది!

17 పంచాయతీల్లో 145 మంది

సర్పంచ్‌ అభ్యర్థులు

188 వార్డులకు 460 మంది పోటీ

మారుమూల గిరిజన గ్రామాల్లోనూ

పెరిగిన ఎన్నికల చైతన్యం

కొత్త పాలకవర్గాలపై ప్రజల్లో ఆసక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement