చింతపల్లి ఎంపీపీకి సత్కారం | - | Sakshi
Sakshi News home page

చింతపల్లి ఎంపీపీకి సత్కారం

Nov 29 2026 2:23 PM | Updated on Nov 29 2026 2:23 PM

చింతపల్లి: మండల అభివృద్ధే ధ్యేయంగా ప్రజలకు పాలన అందించాలని ఆకాంక్షిస్తూ నూతన ఎంపీపీ పొటుకూరి దేవి దంపతులను ఘనంగా సన్మానించారు. శనివారం గొందిపాకలు పంచాయతీ పరిధిలోని ఆమె స్వగ్రామం సమ్మగిరిలో పెదబరడ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్‌ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, వైసీపీ శ్రేణులు కలిసి దంపతులను సత్కరించారు. ఈ సందర్భంగా పంచాయతీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా కార్యక్రమాలు చేపట్టాలని ఎంపీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్‌ మాతే లోవరాజు, వార్డు సభ్యులు పాంగి సోమరాజు, కోసూరి లక్ష్మణరావు, బొండా బుజ్జిబాబు, ఆదినారాయణ, కూడ ప్రకాష్‌, రాజుబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement