ప్రొఫెసర్‌ ఎమెరిటస్‌గా హేమలతాదేవి | - | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ ఎమెరిటస్‌గా హేమలతాదేవి

Nov 29 2026 2:23 PM | Updated on Nov 29 2026 2:23 PM

● పాడేరు వైద్య కళాశాలతొలి ప్రిన్సిపల్‌గా సేవలు

● పదవీ విరమణ అనంతరంమరో కీలక బాధ్యత

● హల్త్‌ యూనివర్సిటీ ఉత్తర్వులు

సాక్షి, పాడేరు: స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కళాశాల గైనకాలజీ విభాగంలో ప్రొఫెసర్‌ ఎమెరిటస్‌గా డాక్టర్‌ హేమలతాదేవిని నియమిస్తూ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. పాడేరు మెడికల్‌ కళాశాల తొలి ప్రిన్సిపల్‌గా నియమితులైన ఆమె రెండున్నరేళ్ల పాటు సేవలందించి పదవీ విరమణ పొందారు. గతంలో డీఎంఈగా కూడా బాధ్యతలు నిర్వహించారు. గిరిజన వైద్యురాలిగా జిల్లా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమె సేవలను గుర్తించి పాడేరు మెడికల్‌ కళాశాలలో ప్రొఫెసర్‌ ఎమెరిటస్‌గా నియమించడంతో వైద్య వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement