సావిత్రీ బాయి పూలే విగ్రహావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

సావిత్రీ బాయి పూలే విగ్రహావిష్కరణ

Aug 28 2026 12:27 AM | Updated on Aug 28 2026 12:27 AM

కె.కోటపాడు: మహిళల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా సావిత్రీ బాయిపూలే, జ్యోతిరావ్‌ పూలేలు విశ్వసించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి జి.జి.ఎస్‌.నాగేశ్వరరావు అన్నారు. పాతవలస జెడ్పీ హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయురాలు సుజాతతో పాటు ఆమె భర్త నాగేశ్వరరావులు సావిత్రీబాయి పూలే విగ్రహాన్ని వారి సొంత నగదుతో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే అని విద్యార్థులకు తెలిపారు. భారతీయ సంఘ సంస్కర్తగాను, ఉపాధ్యాయినిగా, రచయిత్రిగా ఆమె సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంఈవోలు కె.సత్యనారాయణ, డి.వి.డి.ప్రసాద్‌, హెచ్‌ఎం.నాగేశ్వరరావు, ఉపాధ్యాయుడు ఈశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement