బతుకులు | - | Sakshi
Sakshi News home page

బతుకులు

Aug 27 2026 12:24 AM | Updated on Aug 27 2026 12:24 AM

విద్యుత్‌ కాంతులు పంచుతున్న ఆ కార్మికుల బతుకుల్లో వెలుగుకానరావడం లేదు. ఏళ్ల తరబడి గొడ్డుచాకిరీ చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవితాలు వెల్లదీయవలసి వస్తోంది. చుట్టూ ప్రమాదాలు మోహరించి ఉన్నా కుటుంబ పోషణకోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వెట్టిచాకిరీ చేస్తున్న వారిని కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వెలుగులు లేని

గేటు వద్ద సామూహికంగా భోజనాలు

సోషల్‌మీడియాలో వీడియోలనుచూసి కన్నీరుపెట్టుకున్న తల్లిదండ్రులు

ఐటీడీఏ ముట్టడి

మారికవలస నుంచి విద్యార్థుల తరలింపునకు వ్యతిరేకంగా ఆందోళన

పాడేరు రూరల్‌: ‘మా పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి.. చదువులో రాణించి మా బతుకులు మారుస్తారని దూరాభారమైనా పంపిస్తే ఇప్పుడు కనికరం లేకుండా వేరే ప్రాంతానికి తరలించడంతో వారికి నాణ్యమైన చదువు అందదు’ అంటూ గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మా బిడ్డలను మారికవలస గురుకులంలోనే చదువుకోనివ్వండి అంటూ ప్రాధేయపడుతూ పాడేరు ఐటీడీఏ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. విశాఖపట్నంలోని మారికవలస గురుకులం నుంచి గిరిజన విద్యార్థులను తరలించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. నిరంకుశ పాలనలో భాగంగా పాడేరు ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌, జిల్లా యంత్రాంగంతో పాటు వివిధ శాఖల అధికారులు మారికవలస పాఠశాలలో రాత్రి బసచేసి తెల్లవారుజామున విద్యార్థులను కర్కశంగా వివిధ పాఠశాలలకు తరలించడం బాధాకరమన్నారు. కనీసం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా నేరస్తులను తరలించినట్లుగా బస్సుల్లో తరలించడం తగదన్నారు.

తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు

మారికవలస పాఠశాలలో ఉన్న పిల్లలను తక్షణం ప్రభుత్వం బలవంతంగా తరలించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పాఠశాల నుంచి ఖైదీలను తరలించినట్లు విద్యార్థులను బస్సుల్లో తీసుకెళ్లిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ఈ వీడియోలను చూసి వారు తల్లడిల్లిపోయారు. గుండెలు బాదుకుని విలపించారు. అభంశుభం తెలియని విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు తల్లిదండ్రులు విశాఖ వెళ్లి తమ పిల్లలను పాడేరు తీసుకొచ్చారు. పాడేరు ప్రధాన రోడ్డుపై సాయంత్రం ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. కలెక్టర్‌, పీవో, డీడీ తక్షణం సమాధానం చెప్పాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడే సామూహికంగా భోజననాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, నాయకులు పార్వతి, రమేష్‌నాయుడు, వెంకటరాజు, శ్రీను, పుష్పవతి, పుణ్యవతి, మహిళా సంఘం నాయకురాలు చిన్ని పాల్గొన్నారు.

సీలేరు: రాష్ట్రానికి వెలుగులు పంచే విద్యుత్‌ కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మి కుల బతుకులు దయనీయంగా మారుతున్నాయి. చాలీచాలని జీతాలతో కు టుంబాలు సైతం గడవని పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి జెన్‌కోనే నమ్ముకుని పనిచేస్తున్న వారిని ఉన్నతాధికారులు, కూటమి ప్రభు త్వం పట్టించుకోవడం లేదు. వారి శ్రమను దోపిడీ చేస్తూ, కష్టానికి తగిన వేతనం ఇవ్వడం లేదు. ఏపీ జెన్‌కో సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌ పరిధిలో 323 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో మోతుగూడెంలో 210 మంది, డొంకరాయిలో 60 మంది, సీలేరులో 53 మంది దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కేవలం 22 వేల చొప్పున చెల్లిస్తున్నారు. ప్రమోషన్‌ అవకాశం, సరైన ఇంక్రిమెంట్‌, ఈఎస్‌ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత, పెన్షన్‌ తదితర సౌకర్యాలు లేకుండా ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్నారు. 35 ఏళ్లుగా రాత్రీపగలు తేడా లేకుండా ప్రమాదకర పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్‌ వ్యవస్థను రద్దుచేయాలని, తమను సంస్థలో విలీనం చేయాలని, జెన్‌కో నేరుగా జీతాలు ఇవ్వాలని, తెలంగాణ తరహాలో వేతనాలు చెల్లించాలని ఏళ్ల తరబడి కోరుతున్నా ఆలకించే నాథుడే కరవయ్యాడు.

హామీలు గుప్పించి... ఆనక మరిచి

ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్‌ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కూటమి నాయకులు హామీలు గుప్పించి, వారిలో ఆశలు రేకెత్తించారు. తీరా గెలిచిన తరువాత ఆ మాటే మరిచిపోయారు. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రస్తుతం విద్యుత్‌ సంస్థల్లో కాంట్రాక్ట్‌ కార్మికుల సంఖ్య పెరుగుతూ వారే కీలకంగా మారినప్పటికీ వారికి వేతనాలు ఎక్కడవేసిన గొంగలి అన్న చందంగా ఉన్నాయి. దీంతో కుటుంబాన్ని పోషించలేక, పిల్లలకు మంచి చదువులు చెప్పించలేక సతమతమవుతున్నారు.

ప్రమాదకర పనులు

ఏపీ జెన్‌కో సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌లో కాంట్రాక్ట్‌ కార్మికులతో ప్రమాదకర పనులు చేయిస్తున్నారు. అన్‌స్కిల్డ్‌ కేటగిరీలో చేరిన వీరికి సరైన శిక్షణ ఇవ్వకుండా పనులు అప్పగిస్తున్నారు. దీంతో వారి ప్రాణాలకు భద్రత కరవైంది. విధి నిర్వహణలో కాంట్రాక్ట్‌ కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి.

పొరుగు రాష్ట్రంలో..

పొరుగు రాష్ట్రం తెలంగాణ కార్మికులకు రూ. 48 వేలు జీతం చెల్లిస్తుండగా మన రాష్ట్రంలో అదే కార్మికులకు 22,000 జీతం ఇస్తున్నారు. కష్టపడి పనిచేసే కార్మికులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చకుండా నిబంధనల పేరుతో మరింత ఇబ్బందులకు గురి చేస్తోందని పలు యూనియన్‌ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఆందోళనలు చేసినా...

దశాబ్దాలుగా జెన్‌కోలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులను సంస్థలో విలీనం చేయాలని లేదా, సంస్థే నేరుగా తెలంగాణ తరహాలో జీతాలు చెల్లించాలని పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు చేసి, వినతి పత్రాలు అందజేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

కాంట్రాక్ట్‌ కార్మికులే అధికం

గతంలో జెన్‌కోలో పర్మినెంట్‌ ఉద్యోగులు సంఖ్య అధికంగా ఉండేది. ఉద్యోగుల పదవీ విరమణ, మరణించడం, కొత్త నియామకాలు లేకపోవడంతో వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం సీలేరు కాంప్లెక్స్‌పరిధిలోని మూడు ప్రాజెక్టుల్లో సుమారు 250 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు పనిచేస్తుండగా కాంట్రాక్ట్‌ కార్మికులు 323 మంది పనిచేస్తున్నారు. అధికంగా కాంట్రాక్ట్‌ కార్మికులే ఉన్నా వారి సంక్షేమం గురించి పట్టించుకునే వారే లేరు. ఇప్పటికై నా తమను పర్మినెంట్‌ చేయాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్‌ కార్మికులు కోరుతున్నారు

ప్రధాన డిమాండ్లు..

విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను భేషరతుగా పర్మినెంట్‌ చేయాలి.

సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.

గ్రాట్యుటీ రూ.20 లక్షలు, ప్రమాద బీమా రూ.కోటి ప్రతి కార్మికుడికి అమలు చేయాలి.

తెలంగాణ రాష్ట్రం తరహాలో కనీస వేతనం రూ.48 వేలు చెల్లించాలి.

జీవో.167 ప్రకారం పనిచేస్తున్న కార్మికులకు జీవో నంబర్‌ 129 ప్రకారం వేతనాలు చెల్లించాలి.

కాంట్రాక్టర్లు ప్రతి నెల ఒప్పందం ప్రకారం 7 వ తేదీ లోపు వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.

దుర్భరంగా విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల జీవితాలు చాలీచాలని జీతాలతో అవస్థలు

ప్రమాదకర పనులు చేయిస్తున్నా పట్టని ఉన్నతాధికారులు

ఎన్నికల హామీని విస్మరించిన కూటమి ప్రభుత్వం

భారంగా కుటుంబ పోషణ

జీతం సరిపోక ఇబ్బందులు పడుతున్నాం సీలేరులో గత 20 ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికుడిగా పారిశుధ్యం విభాగంలో పనిచేస్తున్నాను. జీతం సరిపోక కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతోంది. కనీస సదుపాయాలు కల్పించడంతో పాటు వేతనాలు పెంచాలి.

– అప్పలరాజు, జెన్‌ కో కార్మికుడు సీలేరు

జీతం చాలక ఇబ్బందులు

నేను సీలేరు ఏపీ జెన్‌కోలో 15 సంవత్సరాలుగా కాంటాక్ట్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం రూ.22 వేలు చేతికి వస్తోంది. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం నిత్యావసర సరుకులు ధరలు, ఇతర ఖర్చులు, పిల్లల చదువుల ఖర్చులు పెరిగిపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోంది. చాలా సంవత్సరాలుగా ఇదే జీతంతో పని చేస్తున్నాను. ప్రభుత్వం స్పందించి జీతం పెంచాలి.

– బాపిరాజు, కాంట్రక్ట్‌ కార్మికుడు, సీలేరు

తెలంగాణ తరహాలోసదుపాయాలు కల్పించాలి

మన రాష్ట్రంలో జెన్‌ కో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. తెలంగాణ తరహాలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ రూ.48 వేల జీతాన్ని అమలు చేయాలి. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం.

– బి.లక్ష్మణరావు,

సీఐటీయూ బ్రాంచ్‌ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement