చింతపల్లి: సకాలంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ చౌడుపల్లి హెచ్‌పీ గ్యాస్ గోదాం వద్ద సోమవారం వినియోగదారులు ఆందోళన చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బుక్ చేసుకున్నప్పటికీ సకాలంలో గ్యాస్ బండలను పంపిణీ చేయడంలేదని వారు ఆరోపించారు. చింతపల్లి డివిజన్ పరిధిలో గ్యాస్ బుక్ చేసుకున్న వారికి కాకుండా ఇతరులకు అధిక సొమ్ముకు విక్రయించుకుంటూ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుక్ చేసి వారం రోజులు కావస్తున్నా గ్యాస్ లేదంటూ, రాలేదంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా సంబంధిత అధికారు లు స్పందించి సకాలంలో గ్యాస్ సరఫరా అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని పలువు రు వినియోగదారులు కోరారు.


