ముంచంగిపుట్టు: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీహెచ్‌సీ వైద్యసిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు దశలవారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. రెగ్యులర్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన వైద్య ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, కాంట్రాక్ట్ వైద్య సిబ్బందికి ఈపీఎఫ్ వర్తింపజేయాలని, అనారోగ్యానికి గురైన ఉద్యోగికి పూర్తి జీతంతో కూడిన సెలవు మంజూరు చేయాలని వైద్య సిబ్బంది రమేష్, సింహాచలం, సురేష్, వసంత కోరారు.


