అనకాపల్లి: ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి అంకితభావంతో రోగులకు సేవలు అందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులర్ చేయాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ సిబ్బంది పట్టణశాఖ అధ్యక్షురాలు రాజేశ్వరి అన్నారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో సోమవారం కాంట్రాక్టు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ నిరసన చేయడం జరుగుతుందని, వేతనాలు పెంపుపై తక్షణం చర్యలు చేపట్టాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని తదితర డిమాండ్లతో నిరసన తెలియజేశారు.


