తహసీల్దారుకు ఫిర్యాదు చేస్తున్న మాజీ సర్పంచ్ పావని
కోటవురట్ల : పాత్రికేయ ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యండపల్లి మాజీ సర్పంచ్ గుడివాడ పావని తహసీల్దారు తిరుమలబాబు, ఎస్‌ఐ రమేష్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 2వ తేదీన గ్రామ దేవత నూకాంబిక అమ్మవారి జాతర నిర్వహిస్తుండగా రాఘవులు అనే విలేకరి తనను డబ్బులు డిమాండ్ చేశాడని, ఇవ్వకపోతే ఇబ్బందులు పడతారని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని డబ్బుల కోసం వేధిస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తహసీల్దారు తిరుమలబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి పెట్ల రాంబాబు, నాయకులు పైల నాని, చీకట్ల వెంకట్, గ్రామస్తులు పాల్గొన్నారు.


