నిత్య విద్యానంద భారతి స్వామికి నూకాంబిక అమ్మవారి చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్
అనకాపల్లి : గుంటూరు చెందిన ఆదిపరాశక్తి క్షేత్ర నిర్వాహకులు నిత్య విద్యానంద భారతిస్వామి సోమవారం గవరపాలెం నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భారతి స్వామికి ఆలయ చైర్మన్ చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్ కుమార్, దాడి రవికుమార్ పొలిమేర స్వాతి ఆనంద్‌కుమార్, మారిశెట్టి శంకరరావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, పైడిరాజు, యరవ్రరపు సంతోషి కుమారి నాగేష్ పాల్గొన్నారు.


