అర్జీదారుల సమస్యను వింటున్న అదనపు ఎస్పీ మోహనరావు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 65 అర్జీలు వచ్చాయి. అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారివారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భూ తగాదాలు–28, కుటుంబ కలహాలు– 5, మోసపూరిత వ్యవహారాలు–2, ఇతర విభాగాలకు చెందినవి – 30 అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


