గంటల కొద్దీ రోడ్లపై నిరీక్షణ
ముంచంగిపుట్టు: మండల కేంద్రం ముంచంగిపుట్టులో ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. ముంచంగిపుట్టు నుంచి పాడేరు వెళ్లే ప్రయాణికులు రోడ్లపై గంటల తరబడి నిరీక్షించవలసి వస్తోంది. ప్రతి రోజు ఉదయం 7గంటలకు ముంచంగిపుట్టు నుంచి పాడేరుకు ఆర్టీసీ బస్సు సర్వీసు ఉంది.ఆ బస్సు వెళ్లి పోతే మళ్లీ 9గంటల వరకు బస్సు సర్వీసు లేదు.రెండు గంటల పాటు బస్సు సర్వీసు లేకపోవడంతో ప్రయాణికులకు ప్రైవేట్ వాహనాలే దిక్కుగా మారుతున్నాయి. ఈ మార్గంలో అతి తక్కువ బస్సు సర్వీసులు నడుపుతుండడంతో వచ్చే బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంచంగిపుట్టు నుంచి జిల్లా కేంద్రం పాడేరుకు వెళ్లేందుకు ఎక్కువ సర్వీసులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.


