కె.జె.పురం గ్రామంలో గాంధీ తీర్థం | - | Sakshi
Sakshi News home page

కె.జె.పురం గ్రామంలో గాంధీ తీర్థం

Feb 1 2026 3:23 AM | Updated on Feb 1 2026 3:23 AM

కె.జె.పురం గ్రామంలో గాంధీ తీర్థం

కె.జె.పురం గ్రామంలో గాంధీ తీర్థం

మాడుగుల రూరల్‌: కె.జె.పురం గ్రామంలో మహత్మా గాంధీతీర్థం శనివారం ఘనంగా నిర్వహించారు. గాంధీ వీధిలో గల గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో దాడి రాము ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి సర్పంచ్‌ జామి రమణబాబు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. గాంధీజీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కాళ్ల అప్పలనాయుడు, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ కాళ్ల రాము, ఉప సర్పంచ్‌ గోవిందరాజులు, ఎం.వి.సత్యనారాయణతో పాటు పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ శరగడం ఆదిబాబు, దేశం గ్రామ శాఖ అధ్యక్షుడు రాపేట జోగినాయుడు, కాళ్ల నర్సింగరాజు, పార్టీ మహిళా నాయకురాలు కర్రి నాగమణి, క్లస్టర్‌ ఇన్‌చార్జి భీశెట్టి విజయలక్ష్మి, తో పాటు పెంటకోట మాలినాయుడు, పరిమి కాసుల జగ్గారావు, ఆడారి జగదీశ్‌, ఆడారి శంకరావు, విశ్రాంతి ఉపాధ్యాయులు కాళ్ల అమ్మతల్లినాయుడు, తనకాల శ్రీను, కోయిలాడ రమణబాబుతో పాటు గాంధీ వీధి ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు క్రీడా పోటీలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement