అంబరాన్నంటిన గౌరీపరమేశ్వరుల సంబరం
అనకాపల్లి : స్థానిక గవరపాలెం గౌరీపరమేశ్వరుల అమ్మవారి ఉత్సవం అంగరంగ వైభవంగా శనివారం జరిగింది. పట్టణ, గవరపాలెం పురవీధులు మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు, ప్రజలతో కిక్కిరిసిపోయ్యాయి. అమ్మవారి ఉత్సవానికి సుమారుగా నెలరోజుల ముందుగా నేలవేషాలు, స్టేజ్‌ప్రొగ్రాంలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కలకత్తా వారి విద్యుత్ లైటింగ్ గవరపాలెం, సుంరమెట్ట జంక్షన్ నుంచి పెరుగుబజార్ జంక్షన్ వరకూ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుమారుగా 3.5 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేసి కమిటీ సభ్యులు, పోలీస్ బందోబస్తులు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ పార్లమెంట్, నియోజకవర్గ సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, మలసాల భరత్‌కుమార్, మాజీ ఎంపీ బీవీ సత్యవతి, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీష్, డీఎస్పీ ఎం.శ్రావణి దర్శించుకున్నారు. నూకాంబిక అమ్మవారి దేవస్థానం తరపున గౌరీపరమేశ్వరులకు సారెను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్, ఉద్యోగులు అందజేశారు.
అమ్మవారి రథం ఊరేగింపు....
గవరపాలెం సతకంపట్టు గౌరీపరమేశ్వరుల అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి రథాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రారంభించారు. అక్కడ నుంచి గవరపాలెం పురవీధులు గుండా సాగి రాత్రి ఒంటిగంటలకు రింగ్‌రోడ్డుకు చేరుకుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకున్ని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
నవదుర్గవేషాలు, గరగలు, పులివేషాలు, తీన్‌మార్ డ్రమ్స్, దాండియా, బుట్టబొమ్మలు, కోబ్రా డాన్స్ వంటి ప్రదర్శనలు ఉత్సవంల ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే డ్యాన్స్‌బేబీ డ్యాన్స్‌లు, బుర్రకథలు, సినిమాడూప్ వంటి అనేక కార్యక్రమలు నిర్వహించారు. మందుగుండా సీతారామయ్య బాణాసంచా విన్యాసాలు అబ్బురపరిచాయి. వైఎస్సార్‌సీపీ 80,81 వార్డు ఇన్‌ఛార్జ్‌లు కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గొల్లవిల్లి శ్రీనివాసరావులను కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించి, అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. పలువురు దాతలు ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరిగింది.
ఆలయ అధ్యక్షుడు కొణతాల సంతోష్ అప్పారావునాయుడు, కార్యదర్శి కొణతాల శ్రీనివాసరావు, కోశాధికారి నూకమహాలక్ష్మీనాయుడు, ఉపాధ్యక్షుడు వెంకట వరప్రసాద్, సహాయ కార్యదర్శులు రమణ, దాడి కృష్ణ, ఉప కోశాధికారి పెంటకోట వెంకట సత్యనారాయణ, కన్వీనర్లు శంకరరావు, నరసింగరావు, ఉత్సవ కమిటీ పర్యవేక్షకులు మురళీకృష్ణ, చంద్రశేఖరరావు, జగ్గారావునాయుడు పాల్గొన్నారు.
అంబరాన్నంటిన గౌరీపరమేశ్వరుల సంబరం
అంబరాన్నంటిన గౌరీపరమేశ్వరుల సంబరం


