ఘనంగా వైఎస్సార్‌ తీర్థ మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వైఎస్సార్‌ తీర్థ మహోత్సవం

Feb 1 2026 3:23 AM | Updated on Feb 1 2026 3:23 AM

ఘనంగా

ఘనంగా వైఎస్సార్‌ తీర్థ మహోత్సవం

కశింకోట : మండలంలోని అమీన్‌సాహెబ్‌పేట గ్రామంలో శనివారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 17వ తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మలసాల భరత్‌కుమార్‌ ప్రోత్సాహంతో మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు మలసాల కిషోర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన తీర్థ మహోత్సవంలో వైఎస్సార్‌ విగ్రహానికి మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్‌ హయాంలో పేదలకు ఆరోగ్య శ్రీ, విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతులకు రుణ మాఫీ వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించారన్నారు. ఆయన అందించిన సేవలు నిరుపమానమైనవన్నారు. అనంతరం నిర్వహించిన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాజీ ఎంపీ సత్యవతి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్‌, గాజువాక నియోజక వర్గ ఇన్‌ఛార్జి దేవాన్ష్‌ రెడ్డి పాల్గొన్నారు. మధ్యాహ్నం గుర్రాల పరుగు పోటీలు నిర్వహించారు. ఉదయం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. సాయంత్రం బుర్రకథ, ఢీ డాన్స్‌ వంటి సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కోలాటాలు, తొడపెద్దు సేవ నిర్వహించారు.

నాగవరంలో ఘనంగా

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీర్థం

మునగపాక: మండలంలోని నాగవరంలో శనివారం రాత్రి వైఎస్సార్‌ తీర్థం ఘనంగా జరిగింది. ఏటా మాఘపౌర్ణమి సందర్భంగా కొత్త నాగవరంలో రాజన్న తీర్థం నిర్వహిస్తూ వస్తున్నారు. ముందుగా మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎంపీపీ దాసరి గౌరీలక్ష్మి అప్పారావుతో పాటు పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ రాజన్న హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. తీర్థం సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది.

ఘనంగా వైఎస్సార్‌ తీర్థ మహోత్సవం 1
1/4

ఘనంగా వైఎస్సార్‌ తీర్థ మహోత్సవం

ఘనంగా వైఎస్సార్‌ తీర్థ మహోత్సవం 2
2/4

ఘనంగా వైఎస్సార్‌ తీర్థ మహోత్సవం

ఘనంగా వైఎస్సార్‌ తీర్థ మహోత్సవం 3
3/4

ఘనంగా వైఎస్సార్‌ తీర్థ మహోత్సవం

ఘనంగా వైఎస్సార్‌ తీర్థ మహోత్సవం 4
4/4

ఘనంగా వైఎస్సార్‌ తీర్థ మహోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement