
ముంచంగిపుట్టులో ముసురు
● ప్రతిరోజూ వర్షం
ముంచంగిపుట్టు: మండలంలో ముసురు వీడడం లేదు. ఏకధాటిగా ప్రతి రోజూ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంచంగిపుట్టు నుంచి పెదబయలు, కుమడ, జోలాపుట్టు, డుడుమ వెళ్లే రహదారులు అధ్వానంగా మారాయి. చాలాచోట్ల రోడ్డుపై మట్టి నిలిచిపోవడంతో వాహన చోదకులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం లక్ష్మీపురం పంచాయతీ కేంద్రంలో జరిగిన వారపు సంత వర్షం కారణంగా బోసిపోయింది. మారుమూల రంగబయలు, బుంగాపుట్టు, భూసిపుట్టు పంచాయతీల్లో వాగులు, గెడ్డలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాకపోకలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యగెడ్డలోకి వరదనీరు భారీగా చేరుతోంది.