
6వ రోజుకు చేరుకున్న శ్రావణలక్ష్మి పూజలు
డాబాగార్డెన్స్: బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మి పూజలు బుధవారం నాటికి 6వ రోజుకు చేరాయి. ఉదయం 8 గంటలకు వేదమంత్రాలు, నాదస్వరాల మధ్య శ్రీలక్ష్మి పూజలు ప్రారంభించారు. ఈ పూజలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. పోస్టు ద్వారా వచ్చిన భక్తుల పేరిట పూజలు నిర్వహించి కుంకుమ, అమ్మవారి యంత్రం, ప్రసాదం పంపారు. పూజలో పాల్గొనదలిచే భక్తులు రూ.400 చెల్లించాలని ఆలయ ఈవో కె.శోభారాణి తెలిపారు. మరిన్ని వివరాలకు 0891–2711725, 2566514 నంబర్లలో సంప్రదించవచ్చు. కార్యక్రమంలో ఏఈవో కె. తిరుమలేశ్వరరావు, సిబ్బంది, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.