
వర్షాలకు పొంగిన వాగులు
● ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలు ● ఇళ్లకు పరిమితమైన మారుమూల గ్రామాల గిరిజనులు
ముంచంగిపుట్టు: మండలంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్ష్మీపురం, బుంగాపుట్టు, రంగబయలు, భూసిపుట్టు, దొడిపుట్టు పంచాయతీల్లోని మారుమూల గ్రామాల్లో కొండవాగులు పొంగాయి. వరదనీటితో గెడ్డలు ప్రమాదకరంగా మారాయి. లక్ష్మీపురం పంచాయతీ ఉబ్బెంగుల, దొరగూడ గ్రామాల చుట్టూ ఉన్న వాగులు కూడా పొంగడంతో గత మూడు రోజులుగా ఆ ప్రాంతాల గిరిజనులు గ్రావ+బీడిచెంప గ్రామ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మాకవరం, కర్రిముఖిపుట్టు, కిలగాడ, వనుగుమ్మ, బరడ పంచాయతీల్లో వర్షపునీరు పొలాల్లోకి చేరడంతో గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు.

వర్షాలకు పొంగిన వాగులు