ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
రంపచోడవరం: ఆర్థిక సమస్యలతో మండలంలోని పెదగెద్దాడలో ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఓయువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పల్నాడు జిల్లా గణపవరానికి చెందిన అకారపు రాజేష్‌కుమార్ (36) అనే వ్యక్తి ఆదివారం రిసార్ట్‌కు వచ్చాడు. రాత్రి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది రూమ్ లోకి చూసి, ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరి యా ఆస్పత్రికి తరలించారు. మృతుడు తలకు ప్లాసిక్ట్ కవర్ చుట్టి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


