కేన్సర్‌ అంటే ఏంటో కూడా తెలియదు..కానీ నా మనోజ్‌

My son diagnosed rare cancer please help me for Treatment - Sakshi

కిల కిల నవ్వులతో ఇల్లంతా సందడి చేసే చిన్నారి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే ఆ కుటుంబమంతా తల్లడిల్లిపోతుంది. అలాంటిది స్కూలుకు వెళ్లి స్నేహితులతో చదువు, ఆటపాటలతో  ఉల్లాసంగా  ఉండాల్సిన కుమారుడు కేన్సర్‌ లాంటి ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడితే  ఆ తల్లిదండ్రులు నిలువునా వణికిపోతారు. గౌతమి, ఆమె భర్త పరిస్థితి ఇలాంటిదే.

గౌతమి కుమారుడు మనోజ్‌కు ఇపుడు అయిదేళ్లు. ముందు తరచుగా జ్వరం వచ్చేది. ఆ తరువాత ఏం తిన్నా వాంతులు చేసుకుంటూ ఉండేవాడు. సాధారణ చికిత్సం చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మనోజ్‌పేరెంట్స్‌ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు. మనోజ్‌కి హాడ్జికిన్స్ లింఫోమా ఉన్నట్లు ఈ ఏడాది జూన్‌లో వైద్యులు నిర్ధారించారు. దీని చికిత్సయ్యే ఖర్చు కూడా ఖరీదైనదే తేల్చారు.  మనోజ్‌ చికిత్సకు రూ. 5 లక్షలు (6114.87 డాలర్లు) కావాలని అంచనా వేశారు. దీనికి తోడు మనోజ్‌ మెడ, కడుపు ప్రాంతంలో గడ్డలు కూడా మొదలు కావడంతో కన్న వారి ఆందోళన మరింత తీవ్రమైంది.  

👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

ఆరు నెలలకు పైగా కేన్సర్‌తో పోరాడుతున్న మనోజ్‌ను దక్కించుకునేందుకు  అష్టకష్టాలు పడుతున్నారు.  అందుకే తమ బిడ్డ ప్రాణాలను రక్షించాలని కాపాడుకునేందుకు దాతలను ఆశ్రయించారు. రోజువారీ కూలీగా పనిచేసే గౌతమి భర్త సంపాదన కుటుంబ పోషణకు అక్కడిక్కడే సరిపోతుంది. ఇంక ఖరీదైన వైద్యం వారి తలకు మించిన భారం.  అయినా శాయశక్తులా బిడ్డ చికిత్సకు ఖర్చుపెట్టారు. మనోజ్‌కి మరికొన్ని రౌండ్లు క్యాన్సర్ థెరపీ చేస్తే, నయమవుతుందని డాక్టర్లు చెప్పడంతో  పెద్దమనసుతో దాతలిచ్చే  విరాళాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 

‘‘మాది గ్రామీణ నేపథ్యం. అసలు కేన్సర్‌ అంటే ఏమిటో మాకు తెలియదు. కానీ ఆ మాయదారి రోగం నా బిడ్డను వేధిస్తోంది. మనోజ్‌ లేత చేతికి ఇంజక్షన్‌ గుచ్చు తున్నపుడు మొదటిసారి వాడి కళ్లల్లో నీళ్లు చూసి నా ప్రాణం విలవిల్లాడిపోయింది. వాడి బాధ చూస్తోంటే కడుపు తరుక్కు పోతోంది. అందుకే నా మనోజ్‌కు దీర్ఘాయుష్షునిచ్చేందుకు నా శక్తికి మించి చేయాలనుకుంటున్నాను. ఇంత చిన్నవయసులో మనోజ్‌ పడుతున్న కష్టాన్ని చూడలేకపోతున్నా. దయచేసిన నా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టండి అంటూ కన్నీళ్లతో ప్రార్థిస్తోంది గౌతమి. (అడ్వర్టోరియల్‌)

👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top