ఆదిలాబాద్‌రూరల్: లక్ష్యసాధన కోసం ప్రణా ళికాబద్ధంగా శ్రమిస్తే విజయం తథ్యమని కలెక్ట ర్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో 200 మంది అ భ్యర్థులకు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కో సం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆ యన ప్రారంభించారు. ఇటీవల స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన పలువురి ని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. తాను ఐఐటీ కాన్పూర్‌లో చదివే రోజుల్లో సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుని లక్ష్యాన్ని సాధించానని గుర్తు చేసుకున్నారు. ఇందులో ఇన్‌చార్జి జిల్లా బీసీ సంక్షే మ శాఖ అధికారి సునీతకుమారి, ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్లు ప్రవీణ్ కుమార్, డాక్టర్ రమేశ్, ఫ్యాకల్టీ రమణ, మోటివేటర్ విజయబాబు, సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు.


