ఇచ్చోడ: పేద, ధనికతేడా లేకుండా ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతోనే బస్సు యాత్ర ప్రారంభించినట్లు తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. యాత్రలో భాగంగా శనివా రం రాత్రి మండలంలోని జామిడి గ్రామాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి పీపు ల్స్ ఫ్రంట్ బస్‌యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. అందరికి సమానంగా నాణ్యమైన విద్య అందించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందులో చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు బాలాజీ, అనంద్, రమేశ్, దళిత బహుజన్ ఫ్రంట్ సభ్యులు పాల్గొన్నారు.


