పుస్తకాల్లేకుండా బడికి రా వడం సంతోషంగా ఉంది. ఈ రోజు మాకు ప్రెష్ గా ఎంజాయ్‌డేగా అని పించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ టపాటల్లో మునిగితేలాం. ఖోఖో ఇతర ఆటలు ఆడాం. లైబ్రరీలో నచ్చిన పుస్తకాలు చదివాం. భయం లేని చదువు, బ్యాగులేని రోజు మనస్సు తేలికగా ఉంటుంది.
– నైతిక, విద్యార్థిని, ఆరో తరగతి, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఆదిలాబాద్
ఆటలు ఆడాం.. పాటలు పాడాం
బ్యాగు లేకుండానే బడికి రమ్మన్నారు. ఒకటి, రెండు బుక్‌లు తీసుకుని వచ్చాను. స్నేహితురాళ్లతో కలిసి ఆటలు ఆడు తూ, పాటలు పాడుతూ గడిపాం. బడికి వచ్చినట్లుగా కా కుండా విహారయాత్రకు వచ్చినట్లుగా అనిపించింది. మా టీచర్లు కూడా మాతో పాటు కూర్చుని ఆటలు ఆడటం ఆనందాన్నిచ్చింది.
– ఽఘనశ్రీ, విద్యార్థిని, ఆరో తరగతి, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఆదిలాబాద్
ప్రభుత్వ నిర్ణయం మంచిదే
రోజు పుస్తకాలతో బడికి వస్తున్నాం. ఏడాది పా టు చదువుతున్నాం. నెలలో ఒకసారి ఇలా పుస్తకా లు లేకుండా బడికి రావ డం సంతోషంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయం బాగుంది. మాపై ఒత్తిడిని దూరం చేస్తోంది. నచ్చిన ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేశాం.
– స్వీటీ, విద్యార్థిని,
గెజిటెడ్ నం.1పాఠశాల, ఆదిలాబాద్


