బాసర: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎస్‌బీఐ అందజేసిన ఉచిత బస్సు సేవలు శనివారం ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో ఎస్‌బీఐ చైర్మన్ ఆలయ ఈవో అంజనదేవికి అప్పగించిన బస్సును బాసరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎస్‌బీఐ బాసర శాఖ మేనేజర్ అశోక్‌కుమార్, ఆలయ అధికారులు ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం సుమారు రూ.25 లక్షల వ్యయంతో ఎస్‌బీఐ శాఖ అందజేసిన ఈ బస్సు గోదావరి రైల్వేస్టేషన్ నుంచి బాసర ఆలయం వరకు భక్తులకు ఉచిత రవాణా సేవలు అందించనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనదేవి, స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజు పూజారి, అర్చకులు మురళీ శర్మ, తదితరులు పాల్గొన్నారు.


