కడెం: మండలంలోని చిన్నబెల్లాల్ జీపీ పరిధిలోని నర్సింగాపూర్ (పెర్కపల్లె)కు చెందిన ఎల్తాపు సాయికుమార్ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ ఉప సర్పంచ్ భర్త ఎల్తాపు శ్రీనివాస్‌కు, సాయికుమార్ కుటుంబానికి భూవివాదం ఉండడంతో శనివారం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. చిన్నబెల్లాల్ గ్రామ ఉప సర్పంచ్ భర్త ఇందిరమ్మ ఇల్లు కట్టుకొనివ్వకుండా అడ్డుకుంటున్నాడని, తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తూ పంచాయతీ జరుగుతుండగానే ఇంట్లోకి వెళ్లి గడ్డి మందు తాగాడు. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది, స్థానికులు అడ్డుకుని 108లో ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


