ఇంద్రవెల్లి: విద్యుత్ షాక్‌తో బైక్ సర్విసింగ్ సెంటర్ యాజమని మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఏమాయికుంటకు చెందిన పవార్ వికాష్ (27), అతని తమ్ముడు పవార్ రాహుల్ ఇద్దరూ కలిసి ఇటీవల మండల కేంద్రంలోని పర్ధాన్‌గూడలో బైక్ సర్విసింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం వికాష్ బైక్ వాటర్ సర్విసింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై స్పృకోల్పోయాడు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతునికి భార్య అక్షిత, కుమార్తె (రెండు నెలలు) ఉన్నారు.


