కై లాస్‌నగర్: ఉపాధ్యాయుల సమస్యలు వెంట నే పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే డీఏ చెల్లించాలని కోరారు. పీఆర్సీ రిపోర్టును మూడు రోజుల్లో తెప్పించి అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చినా దాని ఊసెత్తకపో వడం శోచనీయమని పేర్కొన్నారు. జూలై 1నుంచి పీఆర్సీ అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే ఎన్‌ఈ పీ 2020 ను వెంటనే రద్దు చేయాలని, పేద విద్యార్థుల కు నష్టం కలిగించే పీఎఫ్‌ఆర్‌డీ బిల్లును డిస్మిస్ చేయాలని, ఓపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడులను మూసివేసే చర్యలను తిప్పి కొడతామని హెచ్చరించారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కి ష్టన్న, అశోక్, సూర్యకుమార్, శ్రీనివాస్, లక్ష్మ ణ్‌రావు, విలాస్, గౌస్ మొయినొద్దీన్, శివన్న, శ్యామ్‌సుందర్, శంకర్ తదితరులున్నారు.


