ఇచ్చోడ: మండలంలోని బాబ్జిపేట్ గ్రామస్తులు గురువారం అటవీశాఖ అధికారులను అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన నలవల రాజు చే నును అదే గ్రామానికి చెందిన గేడం భీంరావు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పంట పొలంలో పనిచేస్తున్న భీంరావును అటవీ శాఖ అధికారులు జీపులో ఎక్కించి తీసుకెళ్తున్నారు. గమనించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికా రుల వాహనాలను అడ్డుకున్నారు. భీంరావును వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో అ ధికారులు భీంరావును విడిచి పెట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామానికి త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం ఇవ్వడానికి అట వీశాఖ అనుమతులివ్వాలని డిమాండ్ చేశారు. గ్రామపెద్దలు ఇంద్రు, మణిరాం, బాపురావు, బిక్కు, శేఖర్, రమేశ్ తదితరులున్నారు.


