ఆబ్కారీశాఖకు అంతా కొత్తవారే.. | - | Sakshi
Sakshi News home page

ఆబ్కారీశాఖకు అంతా కొత్తవారే..

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

● కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు జారీ ● గత ప్రమోషన్లకు తాజాగా పోస్టింగ్‌ ● డీసీగా జనార్దన్‌రెడ్డి, ఏసీగా రాజ్యలక్ష్మి ● నాలుగు జిల్లాలకు డీపీఈవోలు రాక

సాక్షి, ఆదిలాబాద్‌: ఎకై ్సజ్‌ శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి. డిప్యూటీ కమిషనర్‌ నుంచి డీపీఈవో (ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌) వరకు అందరూ ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. ఈ శాఖలో రెండున్నర నెలల కిందటే ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది. సీఐలు, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్లు, ఈఎస్‌లు, ఏసీలతోపాటు డిప్యూటీ కమిషనర్‌ (డీసీ) వరకు ప్రమోషన్‌ లభించింది. అప్పుడు వారు ఎక్కడైతే పోస్టింగ్‌లో ఉన్నారో వారిని అదే స్థానంలో కొనసాగించారు. తాజాగా బదిలీలు చేపట్టి ప్రమోషన్‌ పొందిన పోస్టింగ్‌ కల్పించారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్‌ కె.హరికిరణ్‌ నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రెగ్యులర్‌ డిప్యూటీ కమిషనర్‌గా జి.జనార్దన్‌రెడ్డి నియమితులయ్యారు. ఖమ్మంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తూ ప్రమోషన్‌ పొందిన ఆయన తాజాగా ఆదిలాబాద్‌ డీసీగా రానున్నారు. హైదరాబాద్‌ డీసీ కార్యాలయం రెగ్యులర్‌ అధికారిగా ఉండి ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి డీసీగా వ్యవహరించిన రఘురాం స్థానంలో జనార్దన్‌రెడ్డిని నియమించారు. ఇదే కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ క మిషనర్‌ పోస్టును తాజాగా భర్తీ చేశారు. హన్మకొండ–1 టీజీబీసీఎల్‌లో ఏసీగా వ్యవహరిస్తున్న కె. రాజ్యలక్ష్మి ఆదిలాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏసీగా ని యమితులయ్యారు. గతంలో ఆమె ఆదిలాబాద్‌, కు మురంభీం ఆసిఫాబాద్‌ డీపీఈవోగా పని చేశారు.

పర్యవేక్షణ పటిష్టమయ్యేనా?

ఎకై ్సజ్‌ శాఖలో తాజాగా డిప్యూటీ కమిషనర్‌ను రెగ్యులర్‌ అధికారిని నియమించారు. కొంత కాలంగా ఇన్‌చార్జీలతో నెట్టుకొచ్చారు. ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏసీ పోస్టు ఖాళీగానే ఉండగా, తాజాగా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని ఏఈఎస్‌ పోస్టులు కూడా ఖాళీగా ఉండగా, త్వరలో భర్తీ చేసే అవకాశాలున్నాయి. సరైన పర్యవేక్షణ లేక జిల్లాలో గంజాయి, గుడుంబా కేసులు పెరిగాయి. క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకపోయిందన్న విమర్శలున్నాయి. తాజాగా ప్రభుత్వం పోస్టుల భర్తీపై దృష్టి పెట్టడం, ఇప్పటికే కొన్ని నియమించడంతో ఎక్సైజ్‌ శాఖలో పర్యవేక్షణ పటిష్టం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొత్త డీపీఈవోలు వీరే..

ఉమ్మడి జిల్లాలోని నాలుగు డీపీఈవో పోస్టులకు కొత్త అధికారులు నియమితులయ్యారు. నల్గొండలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎ.కిషన్‌ను ఆదిలాబాద్‌కు, బి.చాణక్యను మంచిర్యాలకు, భూపాలపల్లి నుంచి వి.శ్రీనివాస్‌ను నిర్మల్‌కు, సూర్యపేట నుంచి కుమురంభీం ఆసిఫాబాద్‌కు జిల్లాకు లక్ష్మనాయక్‌కు బదిలీలతోపాటు పోస్టింగ్‌ కల్పిస్తూ కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదివరకు డీపీఈవోలుగా వ్యవహరించిన హిమశ్రీ ఆదిలాబాద్‌ నుంచి సిరిసిల్లకు, ఎంఏ రజాక్‌ నిర్మల్‌ నుంచి ఎల్‌బీనగర్‌కు, కేజీ నందగోపాల్‌ మంచిర్యాల నుంచి నిజామాబాద్‌కు, జ్యోతికిరణ్‌ కుమురంభీం ఆసిఫాబాద్‌ నుంచి ప్రమోషన్‌ కల్పిస్తూ రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఏసీగా నియమించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement