ఎస్‌ఐఆర్‌ షురూ.. | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌ షురూ..

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

● వివరాలు నమోదు చేసుకున్న కలెక్టర్‌ ● ఇంటింటా ఫామ్స్‌ ఇచ్చిన బీఎల్వోలు ● ఎన్యూమరేషన్‌పై ప్రజలకు అవగాహన

కై లాస్‌నగర్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ గురువారం జిల్లాలో ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా బీఎల్వోలు తమ పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎ న్యూమరేషన్‌ ఫారాలు అందజేశారు. కలెక్టర్‌ రాజర్షి షా తొలిరోజే రీప్రింటెడ్‌ ఎన్యూమరేషన్‌ ఫామ్‌ ద్వారా తన ఓటు వివరాలు క్షుణ్ణంగా సరిచూసుకున్నారు. 2002 ఓటరు జాబితా ప్రకారం ఉన్న తన వివరాలు నమోదు చేసి, ఒక ఫొటోను జతపర్చి బీ ఎల్వోకు అందజేశారు. దీంతో బీఎల్వో వివరాలను యాప్‌లో వెరిఫై చేసి సబ్‌మిట్‌ చేశారు. అలాగే, ఆర్‌ ఐ శశికళ, బీఎల్వో ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్‌ ప ర్సన్‌ బండారి అనూష ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రా మీణ ప్రాంతాల్లోని ప్రతీ బీఎల్వో తన పరిధిలోని ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించారు. వాటిని పూరించి తిరిగి ఇవ్వాలని సూచించారు. అలా, ఇచ్చిన వారి పేర్లు మాత్రమే జూలై 31న ప్రకటించే ముసాయిదా జాబితాలో ఉంటాయని ఓటర్లకు అవగాహన కల్పించారు. మేజర్‌ గ్రామపంచాయతీలు, మండల కేంద్రాల్లో పలువురు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, బీఎల్వోలతో కలిసి ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని పిట్టలవాడ, తాటిగూడ కాలనీల్లో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ తీరును కలెక్టర్‌ రాజర్షి షా స్వ యంగా పరిశీలించారు. బీఎల్వో పనితీరుపై ఆరా తీశారు. ఓటర్లకు స్వయంగా ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేసి అవగాహన కల్పించారు.

నిజమైన ఓటర్ల పేర్లు తొలగించం

ఓటర్ల జాబితాలోని లోపాలను సవరించి, పారదర్శకమైన జాబితాను రూపొందించేందుకు చేపట్టిన ‘సర్‌’ ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైనట్లు కలెక్టర్‌ రా జర్షి షా తెలిపారు. బూత్‌ స్థాయి అధికారులు నేరుగా ఓటర్ల ఇళ్లకు వస్తారని పేర్కొన్నారు. తమ తల్లి దండ్రుల ఓట్లు వేరే రాష్ట్రాలు, ఇతర జిల్లాల్లో ఉన్నాయని చెబితే ఇక్కడున్న తమ ఓటు పోతుందని కొందరు భయపడుతున్నారని.. అలాంటి అపోహలు వ ద్దని చెప్పారు. అర్హులైన, నిజమైన ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని స్పష్టం చేశారు. ఈ ఎన్యూమరేషన్‌ ఫామ్స్‌ అందించిన ఓటర్ల పేర్లు మాత్రమే 31న ప్రకటించే ‘డ్రాఫ్ట్‌ రోల్‌’లో ప్రచురించనున్నట్లు తెలిపారు. సోషల్‌ మీడియాలో ఓట్ల తొ లగింపుపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని సూచించారు. నిజమైన ఓటర్లంతా తప్పకుండా ఎన్యూమరేషన్‌ ఫామ్‌ నింపి, అందులో తమ వివరాలతోపాటు తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మ లేదా గార్డియన్ల ఓట్ల వివరాలు నమోదు చేయాలని సూచించారు. నింపిన ఫామ్‌లలో ఒక కాపీ ఓటరు వద్ద భద్రంగా ఉంటుందని, మరొకటి బీఎల్వోకు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ఈ అవకాశా న్ని వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement