కార్పొరేట్‌ స్థాయిలో సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ స్థాయిలో సేవలందించాలి

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

● కలెక్టర్‌ రాజర్షి షా ● రిమ్స్‌ డైరెక్టర్‌, డాక్టర్లతో సమీక్ష

ఆదిలాబాద్‌టౌన్‌: రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి లో కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలు అందించే దిశగా అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ రాజర్షిషా సూచించారు. రిమ్స్‌లో వైద్యసేవలు, మౌలిక వసతులు, మందుల లభ్యతపై ఉ న్నతాధికారులు, వైద్యులతో గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఆస్ప త్రిలోని ఈఎన్టీ, యూరాలజీ విభాగాల పనితీరు, రోగుల సంఖ్య, అందిస్తున్న చికిత్సలు, నిర్వహిస్తు న్న శస్త్రచికిత్సల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆధునిక వైద్య పరికరాలు, నిపుణు ల సేవలను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో వచ్చేవారికి నాణ్యమైన వైద్యం అందించి రిమ్స్‌పై ప్రజల్లో వి శ్వాసం పెంచాలని చెప్పారు. ఆస్పత్రిలో అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. అవసరమైన మందుల నిల్వలు ముందుగానే సమకూర్చుకోవాలని, రోగులు బయటి నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రాకుండా చూడాలని సూచించారు. మందుల పంపిణీ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని రిమ్స్‌ డైరెక్టర్‌, ఫార్మసీ అధికారులకు సూచించారు. ఆస్పత్రిలో పా రిశుద్ధ్యం, రోగుల సహాయకులకు కల్పిస్తున్న వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సూపర్‌ స్పెషాలి టీ ఆస్పత్రికి వచ్చే ప్రతీ రోగికి సత్వర, నాణ్యమైన వైద్య సేవలందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌వో సాధన పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement