మాదకద్రవ్యాలను నిర్మూలించాలి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాలను నిర్మూలించాలి

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

ఆదిలాబాద్‌టౌన్‌: మాదకద్రవ్యాలను నిర్మూలించా లని డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని వినా యక్‌ చౌక్‌ వద్ద డ్రగ్స్‌కు వ్యతిరేకంగా చావర అకాడమీ పాఠశాల విద్యార్థులు ఫ్లాష్‌ మాబ్‌ నిర్వహించా రు. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరి ణామాల గురించి నృత్య ప్రదర్శన ద్వారా కళాకారులు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి మాదకద్రవ్యాల కు వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయం గురించి తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. మావల సీఐ ప్రేమ్‌కుమార్‌, ట్రాఫిక్‌ ఎస్సై మనీశ్‌కుమార్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

5కే రన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

‘రన్‌ ఫర్‌ ఫిట్‌నెస్‌–రన్‌ ఫర్‌ యాంటీ డ్రగ్‌’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి నిర్వహించను న్న 5కే రన్‌ పోస్టర్‌ను డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ నేతృత్వంలో నిర్వహించనున్న 5కే రన్‌లో యువకులు, విద్యార్థులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చే యాలని కోరారు. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్‌ కుమార్‌ ఖత్రి, సభ్యులు దశరథ్‌, స్వామి, బాలు ఛాపర్వాల్‌, మారుతి, సునీల్‌ అగర్వాల్‌, రాజు, విజయ్‌స్వామి తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement