ముగిసిన ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్‌గాంధీ పాలిటెక్నిక్‌ కళాశాలలో నాలుగురోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎప్‌సెట్‌ తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గు రువారం ఈ ప్రక్రియను కళాశాల ప్రిన్సిపాల్‌, కో ఆర్డినేటర్‌ డి.నరేశ్‌ పరిశీలించి అభ్యర్థుల సందేహా లను నివృత్తి చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్‌లైన్‌ కేంద్రంలో సౌకర్యాలు కల్పించారు. మొదటిరోజు 202 మంది, రెండోరోజు 110, మూడోరోజు 106 మంది పరిశీలన పూ ర్తి కాగా, చివరిరోజు 117మంది అభ్యర్థులు స్లాట్‌ బుక్‌ చేసుకోగా 106 మంది అభ్యర్థులు సర్టిఫికెట్‌ వెరిఫికేషనకు హాజరయ్యారు. నాలుగురోజుల ప్రక్రియలో 524మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినట్లు కోఆర్డినేటర్‌ నరేశ్‌ తెలిపారు. అన్ని సౌకర్యాలు కల్పించి ప్రశాంత వాతావరణంలో ధ్రు వపత్రాల పరిశీలన పూర్తి చేసినట్లు వివరించారు. స ర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేయించుకున్న విద్యార్థులు ఈ నెల 25 నుంచి జూలై 1వరకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. జూలై 10న తొలివిడత సీట్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement