రోగుల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టవా? | - | Sakshi
Sakshi News home page

రోగుల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టవా?

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

ఆదిలాబాద్‌టౌన్‌: రిమ్స్‌కు వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ఆరోపించారు. గురువా రం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రిని తనిఖీ చేశా రు. రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. వసతులు సరిగా లేకపోవడంతో వైద్యాధి కారులు, పారిశుద్ధ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చే శారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పక్షం రో జులుగా సీటీ స్కాన్‌ యంత్రం పనిచేయకపోవడంతో రోగులు ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లకు వెళ్తున్నార ని తెలిపారు. అయితే, నిర్వహణకు నిధులు రావడంలేదని సిబ్బంది ఎమ్మెల్యేకు చెప్పారు. వెనుకబ డిన జిల్లాను అన్ని విధాలా ఆదుకోవాలని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ రిమ్స్‌ ఆస్పత్రిని పరిశీలించాలని సూచించారు. సాధారణ బదిలీల్లో రిమ్స్‌ నుంచి వెళ్లిన వైద్యుల స్థానంలో ఎవరినీ కేటా యించలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ దీపక్‌ పుష్కర్‌, రేడియాలజిస్ట్‌ కళ్యాణ్‌రెడ్డి, బీజేపీ నాయకులు జోగు రవి, గంట జీవన్‌, ఆదిత్య, సతీశ్‌, గంగాధర్‌ తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement