రిమ్స్‌లో 41 మంది స్టాఫ్‌నర్సుల నియామకం | - | Sakshi
Sakshi News home page

రిమ్స్‌లో 41 మంది స్టాఫ్‌నర్సుల నియామకం

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

ఆదిలాబాద్‌టౌన్‌: రిమ్స్‌ ఆస్పత్రిలో 41 మంది స్టాఫ్‌ నర్సులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహించి ఈ ప్రక్రియను చేపట్టారు. 19 మంది స్టాఫ్‌ నర్సులు గురువారం రిపోర్టు చేసినట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌ తెలిపారు. 2024లో నోటిఫికేషన్‌ వెలువడగా కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో నిరుద్యోగులకు ప్రభుత్వ కొలువులు దక్కాయి. ఇటీవల జరిగిన బదిలీల్లో రిమ్స్‌ నుంచి ఇతర జిల్లాలకు చాలా మంది స్టాఫ్‌ నర్సులు బదిలీపై వెళ్లారు. దీంతో రిమ్స్‌లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోగులకు వైద్య సేవల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎట్టకేలకు రిమ్స్‌కు పోస్టులు కేటాయించడంతో నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement