ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాలు, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, గురుకులాలకు అవసరమయ్యే నిత్యావసర, ఆహార, క్లీనింగ్ వస్తువులు, పెరిషబుల్స్ సరఫరా కొరకు గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో టెండర్లు నిర్వహించారు. ఐటీడీఏ పీవో మంద మకరందు ఆదేశాల మేరకు ఐటీడీఏ డీడీ ప్రేమ కళారెడ్డి , జీసీసీ డీఎం సందీప్‌కుమార్ టెండర్లు నిర్వహించారు. టెండర్ నిబంధనలలో చూయించిన నిత్యావసర వస్తువులను మాత్రమే వసతి గృహాలకు సరఫరా చేయాలని డీఎం టెండర్‌దారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది.


