కారు ఢీకొని ఒకరు.. | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని ఒకరు..

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

నిర్మల్‌టౌన్‌: బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై సుమాంజలి తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్‌ కాలనీ చెందిన రమేశ్‌ (45) పాల కేంద్రంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి తన స్నేహితుడు ప్రవీణ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై కొండాపూర్‌ నుండి నిర్మల్‌ వైపు వెళ్తుండగా శాంతినగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీ కొట్టింది. బైక్‌ వెనకాల కూర్చున్న రమేశ్‌ అక్కడికక్కడే మృతి చెందగా ప్రవీణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా నాలుగు నెలల క్రితం రమేశ్‌ చిన్న కుమారుడైన బబ్లు (25) సోఫీనగర్‌లో జరి గిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement